calender_icon.png 11 November, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్ గేర్‌లో కార్!

11-11-2025 02:01:12 AM

రాష్ట్ర రాజకీయాలకు గీటురాయి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

అధికార కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా ఎలక్షన్

  1. రెండేళ్ల పాలన వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్ సక్సెస్
  2. ఎమ్మెల్యే గోపినాథ్ మరణం తర్వాత బరిలో ఆయన సతీమణి
  3. కలసివచ్చిన సానుభూతిని సానుకూలంగా మార్చుకునే ఎత్తగడ
  4. మంత్రివర్గంలో ముస్లింలకు చోటులేకపోవడాన్ని ప్రశ్నించడం మలుపు
  5. అజారుద్దీన్‌కు మంత్రి పదవికట్టబెట్టిన ఉద్దేశంపైనా ప్రజలకు స్పష్టత

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): దేశ రాజకీయాల్లో ఎక్కడైనా, ఏ రాష్ట్రానికైనా ఉపఎన్నికలు ప్రజాభిప్రాయానికి గీటురాయిగా నిలుస్తాయి. పాలకవర్గ పాలన, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు ఏ మేరకు మద్దతునిస్తాయనేది ఉప ఎన్నికలు రెఫరెండంగా ఉంటాయి.ఇదే కోవలో తెలం గాణలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తుండటం, ఇదే సమ యంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆస్మిక మరణంతో ఉప ఎన్నిక కీలకమైంది. ‘ఈ ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికీ తీర్పు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు.

రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి. తామేమీ తక్కువ కాదన్నట్లు బీజేపీ కూడా రేసులో ఉంది. ఈ నియోజకవర్గంలో మంగళవారం పోలింగ్ జరుగనుంది. ఈ 14న ఫలితాలు వెలువడనున్నాయి.

పక్కా మాస్టర్ ప్లాన్

గడిచిన మూడు వారాలు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలికి బలపం కట్టుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపొందించి గులాబీ శ్రేణులను రంగంలోకి దించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో కేటీఆర్ ఇచ్చిన ప్రసంగాలు రక్తి కట్టించాయి. రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యా లను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం కలసివచ్చింది. బంజారాహిల్స్, యూసుఫ్ గూడాలో ఆయన రోడ్‌షోలకు విశేషమైన స్పందన వచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా పేదల ఇండ్లు కూల్చిందని, పెద్దల ఇండ్ల జోలికి వెళ్లలేదంటూ కేటీఆర్ బాధితుల పక్షాన నిలిచారు. ‘బుల్డోజర్ న్యాయం పేరుతో పేదల ఇండ్లు కూల్చడం తప్పు’ అంటూ నిప్పు లు చెరిగారు. ప్రధానంగా కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ పాలన’ అంటూనే, ‘ప్రజ ల ఇళ్లను రక్షించేది బీఆర్‌ఎస్ మాత్రమే’ అని కేటీఆర్ భరోసానివ్వగలిగారు.

ప్రచారాస్త్రంగా బీఆర్‌ఎస్ అభివృద్ధి 

కేటీఆర్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లి నా పదేళ్లలో బీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధిని గురించి వివరిస్తూ ముందుకు సాగారు. 2014లో పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.6,000 కోట్లు ఉండగా, అది 2023 నా టికి అది రూ.18,500 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. ‘మిషన్ భగీరథ’ పథకం ద్వా రా 1.25 కోట్ల గృహాలకు తాగునీటి సరఫరా చేశామని గుర్తుచేశారు. ‘రైతుబంధు’ ద్వారా 70 లక్షలమంది రైతులకు రూ. 65,000 కో ట్లు అందించామని తెలిపారు.

హైదరాబాద్ మహానగరంలో 70 కి.మీ మేర మోట్రో విస్తరణ గురించి ప్రస్తావించారు. తమ పాల నలో గతంలో కంటే సాగు 25 లక్షల ఎకరా లు పెరగడాన్ని గుర్తుచేశారు. పదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఏడాదికి 2.5 లక్షల కొత్త ఉద్యో గాలు లభించాయని ప్రసంగించారు. వీటన్నింటినీ వివరిస్తూనే నవంబర్ 5న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ‘ప్రగతి నివేదిక’ను వి డుదల చేశారు. తమ హయాంలో నియోజవర్గంలో రూ.5,328 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారు.

వివరణాత్మకంగా గణాంకాలు..

రియల్ ఎస్టేట్ మందగమనం నియోజకవర్గంలో ప్రధాన చర్చగా నిలిచింది. 2025 ఏప్రిల్ నాటికి గృహ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గగా, అమ్ముడుపోని ఇళ్లు 11 శాతం పెరిగి 54,458 యూని ట్లకు చేరినట్లు కేటీఆర్ వివరించారు. భూ ముల పునఃసమీక్ష, పాత ఆడిట్లు వంటి కాం గ్రెస్ ప్రభుత్వ విధాన మార్పులు పెట్టుబడిదారులలో భయాన్ని కలిగించాయని కేటీ ఆర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌డీఐ ప్రవా హం 9 శాతం తగ్గి 4.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

తెలంగాణ వాటా 2023లో రూ. 2.5 లక్షల కోట్లుగా ఉండగా, 2025 నాటికి రూ. 1.8 లక్షల కోట్లకు తగ్గిందని ఆ యన చెప్పారు. హైదరాబాద్ మొత్తంగా గృహ రిజిస్ట్రేషన్లు 35 శాతం పెరిగినా, జూ బ్లీహిల్స్‌లో ప్రీమియం హౌసింగ్ అమ్మకాలు మాత్రం నిలకడగా ఉండి, 2025 తొలి అర్ధభాగంలో 8,205 యూనిట్ల వద్దే ఆగిపో యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూ రెగ్యులరైజేషన్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో కొనుగో లుదారులు వేచి చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

‘రేవంత్ బుల్డోజర్ రాజకీయాలు కేవలం ఆక్రమణలనే కాదు, ప్రజల కలల్నీ కూల్చేస్తున్నాయి’ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశమైం ది. బోరబండా తరహా కూల్చివేతల భయా న్ని చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కు ఎన్నికల కోసం మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ వ్యంగ్యం గా అస్త్రాలు సంధించారు. ఈ పరిణామం ‘క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొట్టాలని వచ్చి వికెట్లు కోల్పోయిన షాట్ లాంటిది’ అని ఆయన ఎద్దేవా చేయడం విశేషం.

హైడ్రా కూల్చివేతల అంశాన్ని కూడా కేటీఆర్ తెలివిగా ఉప యోగించారు. ‘అక్రమ నిర్మాణాల పేరుతో ప్రజల ఆస్తులను కూల్చే బు ల్డోజర్లకు బీఆర్‌ఎస్ అడ్డుకట్ట వేస్తుంది’ అని ఆయన ప్రక టించారు. మొత్తంగా నవంబర్ 11న పోలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యం లో ఈ పోటీ తెలంగాణ రాజకీయాలను మ లుపుతిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల్లో ఉత్సాహం, ముస్లిం ఓ ట్ల మార్పు, ఆర్థిక అసంతృప్తి వంటి అంశాలను కేటీఆర్ ప్రచారంలో ఉపయోగించుకున్నారు.

సానుభూతి సానుకూలం..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలపడం ప్రజల్లో సెంటిమెంట్ పెం చింది. భర్త మరణంతో తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఆమెను ఉప ఎన్నిక బరిలో నిలిపి ప్రజ ల మద్దతు కూడగట్టగలిగారు. ఈ మద్దతుకు ప్రతీక అక్టోబర్ 31న జరిగిన రోడ్ షో. ఆరో జు వేలాది మంది రోడ్లపైకి రావడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

గోపినాథ్ మరణంతో బీఆర్‌ఎస్‌కు సానుభూతి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి రెండూ ఉప ఎన్నికలో గులాబీ గెలుపునకు బాటలు వేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వే స్తున్నారు. ‘నేషనల్ ఫ్యామిలీ ఓపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వహించిన ప్రీ పోల్స్ సర్వే ప్రకారం బీఆర్‌ఎస్‌కు 42.42 శాతం, కాంగ్రెస్‌కు 33.16 శాతం, బీజేపీకి 13.03 శాతం ఓట్లు రావచ్చని అంచనా ఉంది.  

కాంగ్రెస్ ‘ఆరు గ్యారెంటీల’ వైఫల్యంపై..

ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కేటీఆర్ టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 75,000 వేల మందికి ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించి, 25,000 మాత్రమే నిర్మిస్తుందని మండిపడ్డారు. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.2,500 భృతి హామీ విఫలంపైనా ధ్వజమెత్తారు. ఇదే ఒరవడిలో సెప్టెంబర్ 28న ‘బాకీ కార్డ్’ ఉద్యమం అందుకున్నారు. రైతులకు, దళితులకు, మహిళలకు కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చి విఫలమైందో గణాంకాలతో ఆ కార్డు ఉద్యమం చేపట్టారు.

ముస్లింలపై కాంగ్రెస్ వివక్ష..

ముస్లింల మద్దతుకు కూడగట్టేందుకు కేటీఆర్ అమితమైన ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రజనాభాలో 12 శాతం ఉన్న ముస్లింవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికైనా మంత్రిపదవి కట్టబెట్టకపోవడంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 2025 రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీ స్కాలర్‌షిప్‌ను 20 శాతానికి కుదించడాన్ని ఆయన ఉర్దూ సమావేశాల్లో హైలైట్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ విమర్శలు, ముస్లింల నుంచి వచ్చిన ఒత్తిడితో అక్టోబర్ 31న కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను తొందరపడి మంత్రిగా నియమించుకోవడంతో కాంగ్రెస్ మరింత చిక్కుల్లో పడింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీనిని ‘టోకనిజం’గా విమర్శించడంతో కాంగ్రెస్‌కు ఎంఐఎం దూరమైంది. దీని ఫలితంగా 25- శాతం ముస్లిం ఓట్లు బీఆర్‌ఎస్ వైపు మళ్లినట్లు స్థానిక పోల్స్ సూచిస్తున్నాయి.