1 May, 2026 | 11:34 PM

14వ డివిజన్ ఆటో అడ్డాలో మేడే వేడుకలు

01-05-2026 10:22 PM

ఖమ్మం టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం కెకెసి అనుబంధ ఆటో అడ్డా డ్రైవర్లు ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం లోని మధురనగర్లో మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కమతం రామకృష్ణ  జండా ఆవిష్కరణ చేసి ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటో కార్మికులకు మంత్రి తుమ్మల నాగేశ్వరావు, యువ నాయకులు తుమ్మల యుగంధర్ నాయకత్వంలో  కాంగ్రెస్ పార్టీ తరఫున  అండగా ఉంటామని తెలియజేశారు.