24 June, 2026 | 1:01 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారం

01-05-2026 10:20 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను చాటిన విద్యార్థులకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నగదు పురస్కారాన్ని అందించి సత్కరించారు. శుక్రవారం పట్టణంలోని గజిటెడ్ నంబర్ 2 పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సంఘం ప్రతినిధు లు నగదును అందజేసి అభినందించారు.

పది పరీక్షల్లో 566 మార్కులు సాధించిన విద్యార్థి విగ్నేష్, చేతన్, శిరిన్ లను సత్కరించి నగదు బహుమతిని అందించారు. అలాగే పరీక్షల సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి విద్యార్థులకు వెన్నులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లోనూ రాణించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి వేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.