2 May, 2026 | 2:52 AM

ఉమ్మడి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు

02-05-2026 02:00 AM

కరీంనగర్, మే1 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.కార్మీకుల పక్షపాతిగా& కార్మిక సంక్షే మ ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కరీంనగర్ డి సి సి అధ్యక్షలు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు పలు ప్రాంతాల్లో మే డే వేడుకలో పాల్గొని ఎర్ర జెండాను ఎగురవేశారు.శుక్రవారం రోజు వివిధ కార్మీక సం ఘాల నాయకులు, కార్మీకుల సమక్షంలో నగర వ్యాప్తంగా కార్మిక జెండాలు రెప రెప లాడాయి.

మొదటగా నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో నగరపాలక సంస్థ కార్మీకుల జెండాను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు లు కార్మిక ఆవిష్కరించి& మే డే నినాదాలు చేశారు. కార్మీకులకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు కరీంనగర్ బస్టాండ్ సమీపంలో వివిధ కార్మీక విభాలకు చెందిన జెండాను ఏ ఐ టి యూ సి, సి ఐ టి. యూ నాయకులు ఎగరవేసి నినాదాలు చేశారు. అంతే కాకుండా నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆటో ట్రాలీ, గూడ్స్ యూనియన్ కు సంబంధించిన కార్మీక జెండాను ఎగరవేసి నినాదాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.

మే డే సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ& తెలంగాణ ప్రభుత్వం లో జరుగుతున్న కార్మీక సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడ లేవన్నారు. బి జె పి నేతలు మాట్లాడుతూ బీజేపి కేంద్ర ప్రభుత్వం కార్మీక పక్షపాతి అన్నారు. రు. కేంద్రం లోని బి జె పిప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు పరం చేసి& కార్మీకులను నిరుద్యోగుల చేస్తుందని కమ్యూనిస్టు నాయకిలు మండి పడ్డారు. ఆదానీ అంభానీ లాంటి కార్పోరేట్ వ్యక్తులకు పరిశ్రమలను కట్టబెట్టి కార్మీకుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

మేడే స్ఫూర్తితో కార్మికుల లోకం పోరాటాలకు సిద్ధం కావాలి పంజాల శ్రీనివాస్

లక్షల గొంతుకలు ఒకటై పోరాడి హక్కులను సాధించుకున్న రోజే మేడే అని, మే డే స్ఫూర్తితో కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని, బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

మేడే 141వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కరీంనగర్ మండలంలోని చామనప ల్లి గ్రామంలో హమాలీ కార్మికులు ఏర్పాటుచేసిన మేడే జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఎగరవేశారు.కరీంనగర్ మండలంలోని నగునూరు, బొమ్మకల్, జూబ్లీ, దుర్షేడు, మగ్దూంపూర్, చేగుర్తి తదితర గ్రామాల్లో జెండాలు ఎగరవేయడం జరిగింది. *అనంతరం చామనపల్లి గ్రామంలో జరిగిన సభకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో సిపిఐ కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, చామనపల్లి సర్పంచ్ భోగండ ఐలయ్య, ఉప సర్పంచ్ దూడం శ్రీనివాస్ హమాలి కార్మిక నేతలు మెరుగు కొమరయ్య, ముదిగంటి పెద్దిరాజు, భూసారపు ప్రవీణు పెరుమాళ్ళ తిరుపతి,దావు మల్లారెడ్డి, నారాయణరెడ్డి, రాములు నాంపల్లి, భూసారపు భూమయ్య, భూసారపు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

కోనరావుపేటలో  

కోనరావుపేట మే1 (విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో సిఐటియు, సిపిఎం ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రజెండాలను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేడే అనేది ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, ఆ పోరాటాల ఫలితంగానే ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతనాలు, కార్మిక సంక్షేమ చట్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు వంటి సమస్యలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీస వేతనాలు పెంచాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలను అన్ని రంగాల కార్మికులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను బలహీనపరిచే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో పలువురు నాయకులు మేడే చరిత్రను వివరించి కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్కూరి కాశిరం, సిపిఎమ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల, సిఐటియు,హమాలీ సంగం మండల అధ్యక్షులు లోకుర్తి రాజు, చిన్న హమాలీ సంగం అధ్యక్షులు యాస శ్రీనివాస్,సెస్ కార్మిక సంగం నాయకులు సత్యం,సిపిఎం నాయకులు, కార్మిక సంఘ నాయకులు , వివిధ రంగాల కార్మికులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రుద్రంగిలో

రుద్రంగి మే 1 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో కార్మిక సంఘం అధ్యక్షుడు కదాసు నర్సయ్య మేడే జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.ప్రతి సంవత్సరం కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరుగుతుందని అన్నారు.

కార్మి కుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.మేడే వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం CPI(M) పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బడుగు సంజీవ్ జెండాను అరిష్కరించారు.కార్మికుల హక్కుల సాధన కోసం CPI(M) పార్టీ పోరాడుతూనే ఉంటూ కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, కరోబర్ రాజేశం,కదాసు నర్సయ్య, గణేష్, నర్సయ్య,పాల్గొన్నారు.