1 May, 2026 | 2:34 PM

మేడే స్ఫూర్తితో కార్మికులు హక్కుల సాధనకై ఉద్యమించాలి

01-05-2026 01:18 PM

 జిల్లా కార్యదర్శి ఎస్‌.ఎం.డి. ఫయాజ్

కొల్లాపూర్ రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో(Kollapur Town) శుక్రవారం నిర్వహించిన 141వ మేడే ఉత్సవాలు(May Day Celebrations) సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఎం.డి. ఫయాజ్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులు నేడు ప్రపంచీకరణ ప్రభావంతో ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శిస్తూ, వాటి రక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

సుమారు 140 సంవత్సరాల క్రితం సాధించిన ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి, పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని కార్మికులను కోరారు. మేడే స్ఫూర్తితో ఎర్రజెండా కింద ఏకమై తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు జి. కురుమయ్య, కొల్లాపూర్ పట్టణ కార్యదర్శి ఎం.డి. యూసుఫ్, కార్మిక సంఘాల నాయకులు సత్యం, గంగన్న, సత్యనారాయణ, చేపల శేఖర్, జి. వెంకటస్వామి, రామకృష్ణ, జూపూడి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.