calender_icon.png 7 September, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశుని ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి

04-09-2025 04:41:51 PM

రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి (విజయక్రాంతి): గణేశుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరిపై ఉండాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్(Telangana State Farmers Welfare Commission) సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాల వద్ద ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

వెలుగుపల్లి రోడ్డులో గల గల్లీ బాయ్స్ ఆధ్వర్యంలో కేతిరెడ్డి సుజన్యా రెడ్డి, ఆమె కుమార్తెల సహకారంతో ప్రతిష్టించిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేతినేని శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించగా, ఫ్రెండ్స్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు స్థానిక ఎస్సై కాంత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలేపాక రామచంద్రు, గడ్డం శివ, వెంకట రామ నరసయ్య, రామాచారి, అబ్దుల్, అంజయ్య, ఎల్లయ్య ఆయా ఉత్సవ కమిటీల సభ్యులు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.