23 July, 2026 | 1:27 AM

వర్షాలు సమృద్ధిగా కురవాలి తల్లీ!

23-07-2026 12:00 AM
  1. యాదాద్రి బోర్డు సభ్యురాలు, విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయరాజం 
  2. నాగారంలోని శ్రీ వారాహి క్షేత్రంలో ప్రత్యేక పూజలు 

జవహర్‌నగర్, జూలై 22 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలు, విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ సి విజయరాజం బుధవారం నాగారంలోని శ్రీ వారాహి క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, విశిష్టతల గురించి తెలుసుకున్నారు.

ఆలయ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలని, భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందాలని ఆకాంక్షించారు. అలాగే ఆలయ నిర్వహణ, భక్తుల రాకపోకలు, దర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణ వంటి అంశాలపై ఆలయ నిర్వాహకులతో చర్చించారు. శ్రీ వారాహి అమ్మవారి మహిమ, క్షేత్ర ప్రాధాన్యత గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఈ క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తల్లి నిర్మల, ఆలయ కమిటీ చైర్మన్ మామిళ్ళ శ్రీనివాస్ యాదవ్, వేద పండితులు శివ కార్తీక్ శాస్త్రి, రవి శర్మ పండితులు, భక్తులు పాల్గొన్నారు.