23 July, 2026 | 12:34 AM

ఢిల్లీ ఘటనపై కొత్తపేట కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

23-07-2026 12:01 AM

పీసీసీ పిలుపుతో ధర్నాకు తరలిన కార్యకర్తలు

నాగోల్, జూలై 22 (విజయక్రాంతి): ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సంఘీభా వం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ కొత్తపేట కాంగ్రెస్ నాయ కులు ఆందోళనకు సిద్ధమయ్యారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కు మార్ గౌడ్ పిలుపు మేరకు, ఎల్బీనగర్ ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మధు యాష్కీగౌడ్ నాయకత్వంలో కొత్తపేట నుం చి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా లో పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.