calender_icon.png 23 November, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌ను కలిసిన పీర్జాదిగూడ మేయర్

28-07-2024 12:26:40 AM

మేడిపల్లి, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శనివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మేయర్‌తో పాటు కార్పొరేటర్లు మహేష్, మధుసూధన్ రెడ్డి, హరిశంకర్ రెడ్డి, నాయకులు రఘుపతిరెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రఘువర్థన్‌రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా పీర్జాదిగూడలో అవిశ్వాస తీర్మాణం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చర్చించినట్టు మేయర్ తెలిపారు. అలాగే సమావేశంలో పాల్గొన్న నాయకులకు భవిష్యత్ కార్యచరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.