calender_icon.png 23 November, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా ఓషియానియా 100 కి.మీ అల్ట్రా సి’షిప్‌ గెలిచిన అమర్ సింగ్

23-11-2025 10:35:30 AM

న్యూఢిల్లీ: బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా 100 కి.మీ అల్ట్రా ఛాంపియన్‌షిప్‌ను అమర్ సింగ్ దేవాండా విజయ సాధించారు. 6:59:37 సమయంలో పూర్తి చేసి జాతీయ రికార్డును సాధించి భారతదేశం తరపున చరిత్ర సృషించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో పోటీపడుతున్న 11 మంది సభ్యుల బృందంలో అమర్ కూడా ఉన్నాడు. ఆయనను వరల్డ్ అల్ట్రారన్నింగ్ అధ్యక్షుడు డాక్టర్ నదీమ్ ఖాన్ అభినందించారు.

అమర్ సింగ్ దేవండా 6:59:37 సమయంలో జాతీయ రికార్డు సమయంలో ఆసియా ఓషియానియా 100 కి.మీ అల్ట్రా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని భారతదేశం తరపున చరిత్ర సృష్టించాడని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Athletics Federation of India) ఆదివారం ఎక్స్ లో పోస్ట్‌ చేసింది.