వైద్య నిపుణుల నియామకానికి చర్యలు
సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి అన్నివిధాల కృషిచేస్తున్నట్లు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి బెల్లంపల్లి సింగరేణి ఏరియాఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డులు, క్యాజ్ వాలిటీ ల లో తనిఖీ చేశారు. ఆ తర్వాత వైద్యులు, సిబ్బంది తో మాట్లాడారు. కొద్ది రోజుల్లోనే బెల్లంపల్లి ఆసుపత్రి లో వైద్య నిపుణులు, తగిన సిబ్బందిని నియమించేందుకు కృషిచే స్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సౌకర్యార్థం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కాడ్యాలజీ క్యాట్ లాక్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి నుంచి భూపాలపల్లి వరకు గల కార్మికులు,వారికుటుంబాలు మొత్తం 1.80 లక్షల మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. సింగరేణి లో ఖాళీ గా ఉన్న వైద్యుల, సిబ్బంది పోస్టులు భర్తీ చేసేందుకు సింగరేణి యజమాన్యం నిర్ణయం తీసుకుందాన్నారు. దీంతో 32 మంది వైద్యులను175 మంది పోస్టులు భర్తీ చేసేందుకు ఇప్పటికే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించామని వెల్లడించారు. కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు త్వరలో నియామకాలు చెపట్టనున్నట్లు సీ ఎం వో స్పష్టం చేశారు. బెల్లంపల్లి కి ప్రతి నెల లో ఆరుగురు వైద్య నిపుణులు, వారానికి ఒక రోజు క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలో గుండె, కంటి వైద్య నిపుణులు వచ్చి నెలలో రెండు రోజులు క్యాంపు నిర్వహించి కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తారని వివరించారు.ఆయన వెంట బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి డీ వై సీ ఎం వో పాండు రంగ చారీ ఉన్నారు.






