గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చండూరు , ఏప్రిల్ 16 : వేసవి కాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్లు వేయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగాసర్పంచులకు అధికారులకు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమం, సంక్షేమ పథకాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని తెలిపారు. సర్పంచ్లు గ్రామ సమస్యలు పరిష్కరించి నిత్యం ప్రజాసేవలో ఉంటే గొప్ప స్థాయికి ఎదుగుతారని అన్నారు. .
ఈ సమావేశంలో చండూరు ఆర్ డి ఓ శ్రీ దేవి, స్పెషల్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో యాదగిరి , తహసీల్దార్ రమాకాంత్ శర్మ, ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.






