ఆయన ఇచ్చాడు.. ఈయన ముంచాడు..?
జర్నలిస్టులకే టోకరా...
కుట్రదారుల్లో పెద్ద హస్తం..?
జర్నలిస్టు కాలనీపై పన్నాగాలు
కుట్రలకు అధికారులు పావులు
బెల్లంపల్లి, జూలై 13 : అందరి కన్నూ జర్నలిస్టుల స్థలం పైనే పడింది. ముఖ్యంగా రియల్టర్లు, భూకబ్జాగాళ్లు జర్నలిస్టు కాలనీపై విషపుకన్ను వేటువేసింది. ప్రభుత్వ భూములను ఎన్ని కాజేసినా వారి భూ దాహం తీరలేదు. చివరికి జర్నలిస్టుల కాలనీ కూడా వదలిపెట్టలేదు. ఈ భూమినీ కాజేయాడానికి అస్త్రంగా మారిపోయారు. దృష్టిని ఎక్కుపెట్టారు.., అన్నంత పని చేశారు. రాత్రికి రాత్రి కన్నాల శివారులో జర్నలిస్టు కాలనీ స్థలంలో అక్రమంగా కబ్జాకు ప్రయత్నం చేశారు. ఈ పని చేసిందెవరనేది, జర్నలిస్టు కాలనీ స్థలాన్ని కబ్జా చేసే అంత సాహసం సామాన్యులకు ఉంటుందా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.
ఈ సంఘటనపై లిఖితపూర్వకంగా జర్నలిస్టులు కబ్జాకోరులపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై చర్యలు అటుంచితే.. అధికారుల తీరు జర్నలిస్టుల్లో తీరని వేదనకు గురిచేస్తుంది. ఇంత పెద్ద భూక్రమణాపై చర్యలకు బదులుగా అధికారులు జర్నలిస్టు కాలనీ స్థలాన్ని స్వాధీనం చేసుకుకోవడం విడ్డూరంగా ఉంది. దీంతో జర్నలిస్టుల పరిధిలో ఉన్న స్థలం మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ప్రతికూల సంకేతాలు ఇచ్చారు అధికారులు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు జర్నలిస్టుల స్థలాన్ని ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ఈ చర్య వల్ల ఎవరికి లాభం., ఎవరికి నష్టం, అధికారులు ఎవరి పక్షం అనేది కూడ రూడీ అయ్యింది. దీంతో అధికారులు ఎవరికి న్యాయం చేశారనేది తేటతెల్లం అయ్యింది. ఈ విషయంలో అధికారులు తీరుపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారుల చర్యతో ముమ్మాటికి జర్నలిస్టులకు తీరని అన్యాయమే జరిగింది. ఇంతకాలం జర్నలిస్టుల ఆధీనంలో ఉన్న కాలనీ కబ్జాకారుల దుశ్చర్యతో చేజారిపోయింది. ఈ ఘటనను సాకుగా చేసుకుని అధికారులు భూకబ్జాగాళ్ల చిరకాల కలను నిజం చేశారు. బెల్లంపల్లిలో భూ కబ్జాదారుల విద్రోహం పరాకాష్టకు చేరింది.
అధికారులు జర్నలిస్టు కాలనీ స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుకొని బోర్డు పెట్టారు. ఇలా భూకబ్జారాయుళ్లను పావులుగా వాడుకొని అధికారులు ఎవరికీ మేలు చేశారో వారికే తెలియాలి. ఇరువురు కలసి ఆడిన ఈ డ్రామా వెనుకాల ఎవరు ఉన్నారన్నది సమాజానికి తెలిసిపోయింది. ఒక పథకం ప్రకారం జర్నలిస్టుల కాలనీ స్థలాన్ని రియల్ మాఫియాతో వివాదం సృష్టించడం, ఆ తరువాత ఆ స్థలాన్ని జర్నలిస్టులకు మిగలకుండా చేయడం అధికారుల వంతయింది. ఇలా సరికొత్త కుట్రకు ఈ రూపంలో అధికారులు తెర తీశారు.
కబ్జా స్థలాన్ని పరిష్కారించకుండా అధికారులు జర్నలిస్టులకు ఎక్కడాలేని అన్యాయం చేయడంపై విమర్శలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరికీ కొమ్ము కాయకపోతే ఆ స్థలన్ని ఎందుకు స్వాధీనం చేసుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థలంలో ఇది జర్నలిస్టులదనీ, ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు ఎందుకు బోర్డు పెట్టలేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక్కడే అసలు మతలబు ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు అధికారులతో అలా చేపించిందనేది తెలుస్తోన్నది.
ఈ కుట్ర వెనుక ఎవరున్నారు..?
జర్నలిస్టుల స్థలాన్ని కబ్జా చేసిన ఘటనపై జిల్లాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. గత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జర్నలిస్టుల సంక్షేమ కోసం కన్నాల శివారులోనీ ప్రభుత్వ భూమిని 2023 ఎన్నికలకు ఆరు నెలలకు ముందు జర్నలిస్టులకు ఇచ్చారు. ఆ స్థలంలో జర్నలిస్ట్ కాలనీ బోర్డును కూడా పాత్రికేయులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ ఈ స్థలంపై కన్నెత్తి చూసే ధైర్య సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదు.. కొందరు రియల్ వ్యాపారులను ముందు పెట్టి నియోజవర్గం నేతనే ఈ పనికి ఒడిగట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన హస్తమే లేకుంటే.. జర్నలిస్టు కాలనీ స్థలంలో అడుగుపెట్టే దమ్ము ధైర్య సాహసం ఎవరు చెయ్యరు. అది సామాన్యులకు అస్సలు సాధ్యమయ్యే పనేకాదు. జర్నలిస్టులకు ఇచ్చిన స్థలం పూర్తిగా ప్రభుత్వ ఉన్నత భూశాఖ పరిధిలోనూ, సిసిఎల్ లో ఉన్నది. ఏ అధికారి కూడా ఇంతవరకు ఆ స్థలంపై దృష్టి పెట్టలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. అది అధికారులకు జర్నలిస్టుల పట్ల ఉన్న గౌరవం, వారి బాధ్యతకు నిలువుటద్దం.
కాగా సర్వాధికారులు ఉన్న అధికారులే జర్నలిస్ట్ కాలనీ విషయంలో పూర్తి బాధ్యతతో ఉన్నారు. అలాంటిది భూకబ్జాదారులకు ఆ స్థలాన్ని కబ్జా చేసే ధైర్యం ఎక్కడిది. వారి వె నుక రాజకీయ అండదండలు లేకుండానే ఈ సాహసం వారు చేసేవారా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టడం, కబ్జాదారుల ప్రధాన లక్ష్యం ఎం తమాత్రం కాదని తెలుస్తోంది. బలమైన రాజకీయ ప్రతినిధి కనుసనల్లోనే జర్నలిస్ట్ కాలనీపై కుట్రకు తెగబడ్డారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతున్నది.
జర్నలిస్ట్ కాలనీ స్థలాన్ని కబ్జా చేసి స్వప్రయోజనం పొందవచ్చని ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంత సులువుగా అనుకోరూ.. ఈ కబ్జా వెనుక ప్రధాన పథ కం.. ఆ స్థలం జర్నలిస్టు లకు చెందకుండా వి వాదం చేయడమే ఆ నేత ప్రధాన లక్ష్యంగా పన్నిన కుట్రగా కనిపిస్తోంది. ఈ చర్యను ప్ర జలు ఒక నేత స్థలమిస్తే.. మరో నేత ఆ స్థ లాన్ని దక్కకుండా చేశారని చర్చించుకున్నారు. ఈ అభిప్రాయంతో జర్నలిస్టులు పూర్తి గా ఏకీభవిస్తున్నారు.. ఈ కుట్రలో.. భూకబ్జాలో దాగివున్న కాదనలేని సత్యం ఇదే.. జర్నలిస్టుల స్థలాన్ని మాయం చేసి ఆ పాపాన్ని అధికారనేత, వారి అనుచరులు మూట కట్టుకున్నారనీ పలువురు భావిస్తున్నారు. చివరికి అనుకున్నంత పని చేసి జర్నలిస్టుల నోట్లో మన్నుకొట్టారు.
న్యాయం చేయాల్సిన అధికారులు కబ్జాకు తెగబడిన వారిపై చర్యలు లేకపోగా, జర్నలిస్టుల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలోనే జర్నలిస్టుల స్థలం కాలదన్నే కుట్రనే బయటపడింది. జర్నలిస్టులపై బుసలు కొడుతున్న విషపు నాగుల తీరు ప్రజల కంటపడింది.. న్యాయం, ధర్మం కాలం పరీక్షకే వదిలేద్దాం.. అధికార విర్రవీగుడుతనం ఎంతోకాలం సాగదు. ప్రజాప్రతిని ధుల ముసుగులో జర్నలిస్టులపై విషం చి మ్ముతున్న కాల నాగులు ప్రజాగ్రహ జ్వాలల్లో కాలిపోయిన చరిత్రను చూశాం.. అందుకోసం వేచిచూద్దాం..






