16 May, 2026 | 2:31 PM

తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు: సర్పంచ్ సక్రు నాయక్

16-05-2026 01:59 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండాలో వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా బోరు మోటర్ల కు శనివారం ప్రెసింగ్ చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని,అలాగే రానున్న రోజుల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చెస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బానోతు బాబా,వార్డు సభ్యులు మనుర్య,సావిత్రి లచ్చిరాం,గ్రామ ప్రజలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.