14 April, 2026 | 5:07 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే

21-02-2026 12:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మ దినం పురస్కరించుకుని వారి మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి తల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలు అందరికీ ఉండా లని ఆకాంక్షించారు. శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని,

నివాసానికి వచ్చిన కూకట్‌పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం ఓల్ బోయిన్‌పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తో కలిసి పూల బొకే ఇచ్చి, శాలువా తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్, సెక్రెటరీ హరినాథ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.