5 June, 2026 | 2:34 AM

వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా చర్యలు

05-06-2026 12:15 AM

మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్           

యాదగిరిగుట్ట, మే 4 (విజయక్రాంతి): రానున్న వర్షాకాలం దృష్ట్యా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు అనారోగ్య బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. గురువారం యాదగిరిగుట్టలోని కొత్త గుండ్లపల్లి గ్రామంలో 8వ వార్డులో వాటర్ ఫిల్టర్ ను చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ప్రారంభించారు.

అనంతరం  ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్ర మంలో భాగం గా యాదగిరిగుట్ట పట్టణంలో 1,2,3 వార్డు లలో వార్డ్ సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట మున్సిపల్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని దీనికి  పట్టణంలోని ప్రజలు సహకరించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై రానున్న వర్షాకాల రిత్యా అనారోగ్యం పలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైనేజీలు చెత్త నిలవకుండా చూడాలని చెత్త బండికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలన్నారు.

ఇతర ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ బరిగే రమ్య రామచందర్, కమిషనర్ బి శ్రీనివాస్, కౌన్సిలర్ బోడ రాధ,  బూడిద మధు,  కాటబత్తిని స్వప్న ఆంజనేయులు, మాలోతు హరీష్, మాధవి ప్రవీణ్, లావణ్య శ్రీధర్ గౌడ్, సత్యనారాయణ, ధనలక్ష్మి మధుకర్, మల్లేష్, శ్రీధర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ రాజేష్, బండి జంగమ్మ, రహీమ సలాం, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.