18 April, 2026 | 5:09 PM

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైంది

09-05-2024 02:16 AM

మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి

మెదక్, మే 8(విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వా మి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జి ల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవన్నారు. ఎన్నికల కమిషన్ జా రీ చేసిన నియమాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఈసీఐ నియమాల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రీపోలింగ్‌లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమై న ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధి లో ఎన్నికలకు సంబంధించి గ్రామా ల్లో జరిగే ప్రతి విషయం పోలీసులకు తెలిసి ఉండాలన్నారు. నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీసులు ఒకరోజు ముందే ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, డీసీఆర్‌బీ సీఐ మధుసూదన్‌గౌడ్, ఎంటీఆర్‌ఐ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.