18 April, 2026 | 3:49 PM

కాళేశ్వరం విచారణ కమిషనర్‌ను కలిసిన కలెక్టర్

09-05-2024 02:12 AM

సిద్దిపేట, మే 8 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆక్రమాలను విచారించేందుకు ప్రభుత్వం నియమించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కాళేశ్వ రం ప్రాజెక్టు విచారణ కమిషన్ కమిషనర్ పినాక చంద్రఘోష్‌ను సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా అదనపు డీసీపీ మల్లారెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి సిద్దిపేట మీదుగా హైదరా బాద్ తిరుగు ప్రయాణంలో భాగం గా సిద్దిపేటలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు డీసీపీలు సిద్దిపేట శివా రు నాగులబండ వద్ద గల టూరిజం హోటల్ వద్దకు చేరుకొని ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కలెక్టర్‌తో పాటు పలు శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.