18 April, 2026 | 5:50 PM

హెల్మెట్ ధరించండి... ప్రాణాలు కాపాడుకోండి

18-04-2026 04:35 PM

పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ ఉంటే ప్రాణాలతో బయటపడవచ్చని పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో శనివారం అరైవ్ ఆ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి నుండి ద్విచక్ర వాహనంపై  బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు, అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలన్నారు.

ఈ సందర్భంగా పలువురు ద్విచక్ర వాహనదారులకు పోలీసులు ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్సై చంద్రకుమార్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, పలువురు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వాహనదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.