24 July, 2026 | 1:14 AM

అనారోగ్యంతో మేడారం పూజారి మృతి

24-07-2026 12:04 AM

నివాళులర్పించిన సర్పంచ్, గ్రామస్తులు

ములుగు, జూలై 23 (విజయక్రాంతి): అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సమ్మక్క వనదేవత పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన పాపారావు అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. సమ్మక్క తల్లి పూజారి పాపారావు మరణ వార్త మేడారంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

జాతర సందర్భంగా సమ్మక్క తల్లిని చిలుకల గట్టు నుంచి మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి తీసుకువచ్చే పూజారుల బృందంలో పాపారావు ఒకరు. పాపారావు మరణ వార్త తెలుసుకున్న మేడారం గ్రామ సర్పంచ్ భారతి, గ్రామస్తులు పాపారావు ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.