24 July, 2026 | 1:12 AM

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నాం

24-07-2026 12:04 AM
  1. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
  2. నడికుడి గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభం 

చర్ల /దుమ్ముగూడెం, జులై 23, ( విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం అ భివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. గురువారం దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భ వనం గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. గ్రామాభివృద్ధికి అవస రమైన మౌలిక సదుపాయాల కల్పనకు రా ష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు సేవలు వేగంగా అందాలని ఆకాంక్షించారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  

లక్ష్మీనగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని 95 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.  ఈ కార్యక్రమాల్లో భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్  తెల్లం సీతమ్మ, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లం హరిబాబు, నడికుడి సర్పంచ్ జగిడి పాలమ్మ, మండల అధికారులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.