31 March, 2026 | 1:50 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

హైకోర్టులో వైద్య రక్తదాన శిబిరం

05-10-2024 02:30 AM

ప్రారంభించిన చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): జాతీయ న్యాయసేవాధికార సంస్థ సూచనలతో తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ, ఉస్మానియా ఆస్పత్రి, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షలు, రక్త దాన శిబిరాన్ని చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే శుక్రవారం ప్రారంభించారు.

న్యాయవాదులు, హైకోర్టు సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితోపాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పంచాక్షరి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్‌కుమార్ సహాయ్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో మయూర్ పట్నాల తదితరులు పాల్గొన్నారు.