4 March, 2026 | 4:54 PM

ప్రభుత్వ బడిలో వైద్య శిబిరం

04-03-2026 12:00 AM

‘డిజిటల్ స్క్రీనింగ్, హెల్త్ రికార్డ్’

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): చిట్కుల్‌లోని వడ్డెర కాలనీలో గల ఎంపిపి పాఠశాలలో మహేశ్వర మెడికల్ కాలేజీ అం డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబి రం నిర్వహించబడింది. విద్యార్థుల కోసం డిజిటల్ స్క్రీనింగ్, హెల్త్ రికార్డ్ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. పటాన్‌చెరు ఎంఈఓ (జూం) నాగేశ్వరరావు, ప్రధా నోపాధ్యాయురాలు సైదమ్మ కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

వైద్య బృందం వి ద్యార్థులకు కంటి, ఈఎన్‌టి, దంత సమస్యలు, పోషకాహార లోపాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. చికిత్స అవ సరమైన విద్యార్థులను తగిన వైద్యం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ హర్షిత నేతృత్వంలోని వైద్య బృందం ఈ శిబిరాన్ని నిర్వహించగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చలపతిరావు వీరికి సహకరించారు. సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్, ఎంఈ ఓకి  మహేశ్వ ర యాజమాన్యం తరఫున సీనియర్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.