05-07-2025 06:06:58 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(Ayushman Health Center) పరిధిలోని బిల్లుడు తండా గ్రామంలో శనివారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు తల్లులకు సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి లేని రేపటి భారత సమాజం కోరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ చేస్తున్న ఉచిత స్క్రీనింగ్ పరీక్ష సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఈ సందర్భంగా సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విస్తరణ అధికారి దేవా కోరారు. ఈ సందర్భంగా తేజవత్ లావణ్య ప్రసాద్ దంపతులకు చెందిన పాపకు అన్నప్రాసన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ హారిక, ఏ ఎన్ ఎం లు కమల, సుజాత, అంగన్వాడీ టీచర్ సరోజ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.