calender_icon.png 5 July, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోథ్ ఆత్మ చైర్మన్ గా రాజు యాదవ్

05-07-2025 06:04:42 PM

బోథ్ (విజయక్రాంతి): అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(Agriculture Technology Management Agency) బోథ్ బ్లాక్ ఫార్మర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా గొర్ల రాజు యాదవ్ నియమితులయ్యారు. అదేవిధంగా బోథ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి బండారి సుశీల, అశోక్, సుద్దుల లక్ష్మిస్వామి, కొట్టాల సంగీత గంగారెడ్డి, గడ్డల నారాయణ, కస్తూరి శ్రీకాంత్, మడావి గంగారం, షేక్ అబూద్, రహీముద్దీన్ లతో పాటు సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ మండలాల నుంచి మొత్తం 25 మంది సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితితో వీరందరూ పని చేయనున్నారు.  నూతన ఆత్మ కమిటీ నియామకానికి కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డిలకు నూతన చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.