calender_icon.png 6 July, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరగా టిమ్స్ పనులు పూర్తి చేయాలి

05-07-2025 11:56:12 PM

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ..

హైదరాబాద్ (విజయక్రాంతి): సనత్‌నగర్, అల్వాల్, కొత్తపేట టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో, పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. హాస్పిటళ్ల సివిల్ వర్క్స్, ఎక్విప్‌మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఒక టైమ్‌లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటళ్లు ప్రారంభించిన రోజు నుండే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఈ 4 హాస్పిటళ్ల కోసం అధునాతన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు.