డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు మరొక అవకాశం
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): డా.బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకునే విద్యార్థి విద్యార్థినులకు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు సెప్టెంబర్ 12 తేది వరకు పొడగించడం జరిగిందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాసరాజు, కోఆర్డినేటర్ డా.రాజారామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్టడీ సెంటర్ కలదు ఆర్థిక స్తోమత లేక, చదువ మధ్యలో ఆపేసిన వారు
వితంతువులు, ఇతర కారణాల వలన చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు ట్యూషన్ ఫీజును చెల్లించడానికి కూడా సెప్టెంబర్ 12వ తేదీ చివరి తేదీ అని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 12 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8919436579, 7382929758 సంప్రదించగలరు.






