calender_icon.png 2 August, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తాలేని వైద్యాధికారులు!

02-08-2025 01:39:33 AM

  1. పీహెచ్సీల్లో కనిపించని వైద్యులు

పనిచేయని పల్లె దవఖానాలు 

వేధిస్తున్న మందుల కొరత

అధికారుల తనిఖీల్లో లీక్ వీరులు 

ప్రైవేటు వైపు రోగుల పరుగులు

నాగర్ కర్నూల్, ఆగస్టు ౧ (విజయక్రాంతి): వరుసగా కురుస్తున్న ముసురు వ ర్షాలకు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ల వ్యవస్థ లేకపోవడంతో ఆ యా గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు, అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. మురుగు కాలువలు శుభ్రపర్చకుం డా చెత్త చెదారంతో పేరుకుపోయి ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతూనే ఉంది.

ఫ లితంగా దోమలు కూడా వ్యాప్తి చెంది ప్రజ లు వ్యాధుల బారిన పడుతున్నారు. ముసు రు వర్షాల కారణంగా మిషన్ భగీరథ నాళా లు పైపుల వద్ద నీరు కలుషితమవుతున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవఖాణాలు, ఆరోగ్య కేంద్రాలు సరిపడిన స్టాఫ్ నర్స్ ఇ తర సిబ్బంది లేకపోవడంతో మండల వైద్యాధికారులు కూడా తరచూ విధులకు డుమ్మా కొడుతున్నారని చర్చ జరుగుతోంది.

సరిపడినన్ని మందులు లేవనే సాకులు చూపి ప రోక్షంగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలు, ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శ లు కూడా బాహాటంగా వినిపిస్తున్నాయి. మరి కొంతమంది వైద్యాధికారులు ప్రైవేటు ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఎక్కువ శాతం కాలం గడుపుతున్నట్లు రో గులు వాపోతున్నారు. 

పేదలపై దండెత్తుతున్న రోగాలు

ప్రస్తుతం ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు, జ్వ రం, వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వం టి వ్యాధులు నిరుపేదలపై దండెత్తుతున్నా యి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందక తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్.ఎం.పి, పి.ఎం.పి ఇతర ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి వారి జేబులకు చిల్లులు పెట్టుకుం టున్నారని సామాన్యుల నుండి ఆందోళన వ్యక్తం అవుతుంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు వైద్యాధికారులు అటువైపు క న్నెత్తి కూడా చూడటం లేదని చెంచు గిరిజన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు మూడు గంటలు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సరైన వ్యాధి నిర్ధారణ కిట్లు, సం బంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చిన్నపాటి దగ్గు జలుబు ఒళ్ళు నొప్పు లకు కూడా ప్రైవేటు ఆసుపతృలనే ఆశ్రయించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.

మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంలు వేర్వేరుగా మండల ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు ముందుగానే గ్రహిం చిన కొంతమంది లీకు వీరులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు ముం దే సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అ యినప్పటికీ తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ వెళ్లిన సమయం లో అన్నీ ఖాళీ కుర్చీలే దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా వైద్యుల నిర్లక్ష్యం బయటపడిం ది.

తనిఖీ చేసే సమయానికి హాజరు కాలేని సదరు వైద్యురాలు ఫోన్లో లీవ్ అడిగినట్లు చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. జి ల్లా వైద్యాధికారి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తనిఖీ చే సే సమయంలోనూ ఆయా మండల వైద్యాధికారులకు ముందే సమాచారం ఎలా వె ళ్తోందని చర్చ నడుస్తోంది. డుమ్మా కొట్టినట్లు దొరికిపోయిన వైద్యులపై చర్యలు తీ సుకునేం దుకు మాత్రం మానవత్వం అడ్డుపడుతుండటం విశేషం.

మరికొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బంది రోజుల తరబడి విధులకు వెళ్లకపోయినా టన్చన్ గా జీతం ఎలా అందుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఫలితంగా పనిచేసే ఉద్యోగులకే మరిం త అదనపు పని భారం పడుతోందని దింతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్.ఎం.పి, పి.ఎం.పి ఇతర ప్రైవేటు ఆసుపత్రులపై ఎలాంటి తనిఖీలు జరపకుండా నెల నెలా ముడుపులు అందుతున్న ట్లు బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నా యి.

ఎలాంటి అనుమతులు లేకపోయి నా ఆర్.ఎం.పి, పిఎంపీలు నిబంధనలకు వి రుద్ధంగా స్థాయికి మించి వైద్యం అందించ డంతో అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు నిజమేననే వాదన వినిపిస్తోంది. మరికొన్ని ఎలాంటి అనుమతులేని డయాగ్నటిక్ సెంట ర్స్ అడ్డగోలుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

మరి కొంతమంది నిరుపేద రోగులు అచ్చంపేట, కొల్లాపూర్ వంటి మారుమూల గ్రామాల్లో సరైన వైద్యం అందడం లేదని జిల్లా జనరల్ ఆసుపత్రికి పరుగులు పెడుతున్న పరిస్థితి.

అప్రమత్తంగానే ఉన్నాం 

ప్రస్తుతం సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులం తా అప్రమత్తంగానే ఉన్నారు. తరచూ జిల్లా, మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులతో పర్యవేక్షణ జరుపుతున్నాం. ప్రతి పీహెచ్సీలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులను గుర్తించేందుకు ప్రత్యేక కిట్లను అందుబాటులో ఉంచాం.

ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అందుబాటులోనే ఉన్నా రు. ఎక్కడ ఎలాంటి మందుల కొరత లేకుండా చూస్తున్నాం. ఆర్‌ఎంపి పి.ఎం. పి ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసి నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. 

 డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారిణి, నాగర్ కర్నూల్

మందుల కొరత లేకుండా చూస్తున్నాం..

జిల్లాలోని ఆయా మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 1500 పైగా ఓపి, 800 కు పైగా ఇన్ పే షెంట్లు వైద్యం పొందుతున్నారు. ప్రస్తు తం దగ్గు, జలుబు, జ్వరం ఒళ్ళు నొప్పు లు వంటి సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారు. అందుకు తగినన్ని మందులు కొరత లేకుండా చూస్తున్నాం. మరికొన్ని మందులు సరఫరా కోసం టెండర్లు వాటి అనుమతికి ఉన్నతాధికారులకు నివేదించాం. 

డాక్టర్ ఉషా రాణి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, నాగర్ కర్నూల్