02-08-2025 01:25:25 AM
కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతు న్నా అధికారుల్లో ఉలుకు లేదు.. పలుకు లే దు. 58,59 జీవో అక్రమార్కులకు వరంగా మారుతుంది. అనుమతులు ఎవరిస్తున్నారు. డబ్బులు ఎవరెవరి చేతులు మారుతున్నా యో లెక్కేలేదు.
అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటు న్నారు. ఈ తతంగం వెనక ఓ మున్సిపల్‌కమిషనర్, ఆయన కొడుకు చక్రం తిప్పుతు న్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, మున్సిపల్‌అధికారులు ఎలాగూ పట్టించుకో రు.. కలెక్టర్‌సారూ మీరైనా పట్టించుకుని ప్ర భుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
రంగారెడ్డి,అబ్దుల్లాపూర్‌మెట్ ఆగస్టు 1 (విజయ క్రాంతి): ప్రభుత్వ భూములలో అక్ర మ నిర్మాణాలపై రెవెన్యూ, మున్సిపల్ ఉలు కు పలుకు లేదని పెద్ద ఎత్తు విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అం దులో నిర్మాణాలు చేపడితే వాటిపై చర్యలకు అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారు? దీని వెనక అసలు సూత్రదారులెవ్వరు? ప్ర ధాన పాత్ర ఎవ్వరు వహిస్తున్నారు.
కోట్లాది రూపాయాలు విలువ చేసే ప్రభుత్వ భూమి ని దర్జాగా కబ్జాలు చేస్తుంటే ఏమీ చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ ప్రభుత్వ భూ మి కబ్జా వెనుక ఓ మున్సిపల్‌కమిషనర్‌హ స్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున దూమారం లేస్తుం ది. ఈ ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులకు సమాచారం వెళ్లడంతో ఆ అ క్రమ నిర్మాణాలపై నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు.
కమిషనర్‌కొడుకు పేర దందా!
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5859 జీవోలు తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములు, గ్రామకంఠ భూములు ఉన్నారు ఈ జీవోల కింద రెగ్యులర్‌చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ జీవోల ద్వారా అసలైన అర్హులకు న్యాయం జరగలేదు. బడాబాబులకు, భూ కబ్జాదారులకు మాత్రం రెగ్యులరైజేషన్‌అయ్యాయి. రం గారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాముల గ్రామ సర్వేనెంబర్386లో ఓ మున్సిపల్‌కమిషనర్‌సుపుత్రుడు పేర 59 జీవో క్రింద రెగ్యులర్ 131 గజాల స్థలం రె గ్యులర్ అయ్యిన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఇందు లో పెద్ద ట్వీస్ట్ ఉం ది.
ఇదే గ్రామ రెవె న్యూ సర్వే నెంబర్‌చెందిన కొంత మంది పేదలు రెగ్యులరైజేషన్‌కింది అప్లై చేసకోగా.. వారికి మాత్రం రెగ్యులర్ కా లేదు. అదే మున్సిపల్ కమిషనర్ కొడుకు రె గ్యులర్ ఎలా అయింది? ఓ మున్సిపల్‌కమిషనర్‌కొడుకు పేదవాడ? ప్రభుత్వ భూమి ఎ లా రెగ్యులర్ చేస్తరు? 131 రెగ్యులర్ చేసిండ్రే అనుకో ఆయనకు ఎంత వరకు రెగ్యులర్ అ యిందో.. అందులోనే కబ్జాలో ఉండాలి క దా..
ఇయన గారు కబ్జాలో ఉన్నది 1000 గ జాల మేర ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ స్థలం విలువ కోట్లలో పలు కుంది. అందులో అక్రమ షెటర్లు నిర్మిస్తున్నా రు. ఎంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమీ చేస్టున్నట్లు? ఆ అక్రమ నిర్మాణా లను కూల్చివేయాల్సిన రెవెన్యూ అధికారు లు మాత్రం అలస్వతం వహిస్తూ.. నామమాత్రపు కూల్చివేతలు చేస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
స్థానిక నేతల అండదండలు
పసుమామలు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో నిర్మిస్తున్నా అక్రమ నిర్మాణాలకు స్థానిక అధికార పార్టీ నాయకులు అండదండలున్నట్లు జోరుగా ప్రచారం అవుతుంది. స్థానిక నాయకులతో ఒత్తిడితో రెవె న్యూ, మున్సిపల్ అధికారులు ఆ అక్రమ ని ర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణా లను అండగా ఉండడ వలన స్థానిక నాయకులకు పెద్ద ఎత్తున ముడుపు అందిన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
మున్సిపల్ క మిషనర్‌కొడుకు షెటర్లు నిర్మించే స్థలంలో గతంలో కళానగర్ వాసులు అక్కడ శివాలయాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యమంగా రే వంత్‌రెడ్డి గొప్ప లక్ష్యంగా ముందుకు వెళ్లి.. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రభుత్వ భూ ములను, పార్కు స్థలాలను కాపాడాలనే మంచి సంకల్పం ఉంటే స్థానిక ఉండే నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ చెడ్డపేరు తెస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పతంలో తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే.. స్థాని క నాయకుల తప్పిదాల వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమార్కులను శిక్షించాలి
పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో అక్రమంగా నిర్మిస్తున్నా షెటర్ల యజమానికి స్థానిక అధికార పా ర్టీ నేతల అండదండలున్నాయి. వీళ్లకు రె వెన్యూ, మున్సిపల్ అధికారులతోడై అ క్రమార్కులకు దాసోహం చేస్తుండ్రు. గ తంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చి ఫలితం లేదు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు కబ్జాలకు గురవుతుంటే అధికారులు ఏమీ చేస్తున్నారు? భూములను ఆక్రమించి.. నిర్మాణాలపై చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
యంజాల ప్రహ్లాద్, బీఎస్పీ నాయకులు