మహిళల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యం
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 7(విజయ క్రాంతి): మహిళల సంక్షేమం, అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా-శిశు సంక్షేమ శాఖ, మహి ళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన భేటీ జన్మోత్సవ్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంతో కలిసి హాజర య్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భేటీ బచావోభేటీ పడావో కార్యక్ర మం ద్వారా ఆడపిల్లలను కాపాడు తూ చదివిస్తూ వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు పురుషులతో సమా నంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తూ పలు పథకాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
అనంతరం కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అవసరమైన 12 రకాల వస్తువులతో కూడిన 10 బేబీ కిట్లు పంపిణీ చేయగా, అంగన్వాడీ టీచర్లకు విధు ల నిర్వహణ కోసం 871 4జీ మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఏసీడీపీవోలు, సూప ర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.




