11-09-2025 12:07:06 PM
ఓ బాధితుడి ఆవేదన
వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు పోకడ
అలంపూర్: గద్వాల జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రికి(Alampur 100 Bedded Hospital) వైద్య సేవల కోసం వచ్చే రోగుల పట్ల క్రింది స్థాయి వైద్య సిబ్బంది(Medical staff) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున అనే ఓ యువకుడు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మాత్తుగా గుండెకు(heart attack) సంబంధించిన సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం స్థానిక వంద పడకల ఆసుపత్రికి వచ్చారు.
ఓపీ తీసుకునే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు వివరాలు చెప్పడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు.దీంతో వైద్య సిబ్బంది బాధితుడి పట్ల నీ డ్రామాలు ఆపు... అంటూ కోపంతో నిర్లక్ష్యంగా మాట్లాడడం చర్చనీయంగా మారింది.వెంటనే అదే సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ రోగితో మాట్లాడి పరిస్థితిని పరీక్షించి సీరియస్ కేసుగా పరిగణించించి మెరుగైన వైద్య చికిత్స కోసం బాధితుడికి వివరించినట్లు తెలిసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడు కర్నూల్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అడ్మిన్ అయ్యి చికిత్స పొందుతూ ప్రాణాలతో బయట పడ్డాడు.దీనిపైన సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.