20-08-2025 12:47:50 AM
నారాయణపేట.ఆగస్టు 19 (విజయక్రాంతి) : రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తనకు తెలపాలని కలెక్టర్ వైద్యులను కోరారు.
ఈ సందర్భంగాసదరం క్యాంప్ కై వచ్చిన వారితో మాట్లాడిసదరం క్యాంప్ సిబ్బంది రాకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ఆలస్యం అయిందని కలెక్టర్ దృష్టికి వైద్యులు తీసుకొచ్చారు. అలాగే ఆసుపత్రి లో సిబ్బంది వివరాలు, వైద్యుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపి ఎంత మంది వస్తున్నారు అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలం దించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. CT స్కాన్, X ray గదులను సందర్శించారు. ఈ సందర్బంగా తనిఖి సమయం లో డ్యూటీ డాక్టర్ జి ఆదిత్య, వైస్ ప్రిన్సిపాల్ కిరణ్ ప్రకాష్, డాక్టర్ రాఘవేందర్ RMO ఆసుపత్రి సిబ్బంది, వైద్యులుఉన్నారు.