calender_icon.png 20 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియాను సరిహద్దులు దాటిస్తే చర్యలు తప్పవు

20-08-2025 12:48:19 AM

అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును సందర్శించిన సీపీ, కలెక్టర్ 

కోటపల్లి(చెన్నూర్), ఆగస్టు 19 (విజయక్రాంతి): జిల్లాకు కేటాయించిన యూరియాను కొందరు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళ వారం రామగుండం సీపీ అంబర్ కిశోర్ జాతో కలిసి జిల్లాలోని కోటపల్లి మండలం పార్ పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని, పంట సాగుకు మాత్రమే యూరియాను వినియోగించాలన్నారు.

రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం ద్వారా యూరియా అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నా రు. అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నామని, ఈ 14న సరైన ఆధారాలు లేకుండా అక్రమంగా యూరియా రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకొని సంబంధిత వ్యక్తులపై 6ఎ కేసు నమోదు చేశామన్నారు. 

దుకాణాల ముందు పట్టిక ప్రదర్శించాలి

విక్రయ దుకాణదారులు యూరియా నిల్వ లు, ధరల పట్టికను దుకాణం ముందు ప్రదర్శించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు యూరియా సంబంధిత వివరాలతో ప్రతిరోజు నివేదిక అందించాలని ఆదేశించారు. డ్రోన్ ల ద్వారా పిచికారి చేసే మినీ యూరియా జిల్లాలోని చెన్నూర్‌లో అందుబాటులో ఉందని, అవసరం కలిగిన రైతులు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 2,500 మెట్రిక్ టన్ను ల యూరియా అందుబాటులో ఉందని, యూరియా లేదనే అవాస్తవాన్ని ఎవరు నమ్మకూడదన్నారు. వీరి వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్సై రాజేందర్ ఉన్నారు.