26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

అంతా మా ఇష్టం

06-12-2025 12:00 AM

-గ్రామాలలో కార్యదర్శుల ఇష్టారాజ్యం

-వారి విధానాలతో గ్రామ పాలన అస్తవ్యస్తం

-కొందరు కార్యదర్శుల నిర్వాకంతో కుదేలవుతున్న గ్రామాలు 

-అందుబాటులో ఉండని  భల్లుతండ కార్యదర్శి

మోతె, డిసెంబర్ 5:- గ్రామ పాలన సవ్యంగా ఉండడం కోసం, పాలన సవ్యంగా సాగేందుకు ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులను నియమించింది. వారి బాధ్యతలు చాలా గొప్పవి. గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కేవలం వాళ్ల చేతుల్లోనే ఉంది. కానీ కొందరు కార్యదర్శుల నిర్లక్ష్యం, వాళ్లు చేపడుతున్నటువంటి పనుల వల్ల పాలన కుంటుపడటంతో పాటు గ్రామాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి.

కొన్ని గ్రామాలకు చెందిన కార్యదర్శులు అయితే ఎప్పుడొస్తున్నారు ఎప్పుడు పోతున్నారు ఎవరికీ అర్థం కాకుండా పోయింది. కేవలం ఉదయం పూట వస్తారు పేసు రిసిగ్నేషన్ సిస్టంలో ఫోటో అప్లోడ్ చేసుకొని తమ వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్తున్నట్లు వినికిడి. మళ్లీ ఏదైనా అధికారులు వస్తేనో,  అత్యవసర పనులు ఉంటేనో గ్రామాలలో దర్శనమిస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. 

వ్యక్తిగత పనులకే ప్రాధాన్యత

గ్రామకార్యదర్శులు వ్యక్తిగత పనులకే పూర్తిస్థాయిలో కేటాయిస్తున్నారనేధి వారిపై ఉన్న ప్రధాన అభియోగం. వీరు అనుసరిస్తున్న విధానాల వలననే కొన్ని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకు మాత్రమే వీరు కార్యదర్శులు కానీ చేసుకునేవి అన్ని వాళ్ళ సొంత కార్యాలే.

 అందుబాటులో ఉండేది అంతంతే..

పంచాయతీ కార్యదర్శులు ఫేస్ రికగ్నిషన్ వలన సమయానికి వచ్చి ఫోటోను అప్లోడ్ చేస్తారు. తదుపరి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంది భోజనం పేరిట బయటకు వెళ్ళి చాలా చోట్ల తిరిగి రావడం లేదనేది వారిపై వస్తున్న విమర్శ. తప్పని పరిస్థితి అయితేనే ఊర్లోకి వస్తున్నారని, లేకపోతే ఫోటో అప్లోడ్ కాగానే వెళ్ళిపోతున్నట్లు పాలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

గ్రామస్తులకు అందుబాటులో ఉండకుండా అవసరమైతే మండల కేంద్రంలో కూర్చొని పనుల నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళని మండల కేంద్రానికే రమ్మంటున్నట్లు తెలుస్తుంది. గ్రామస్థులు ఫోన్ చేస్తే మండల కేంద్రంలో పనుల నిమిత్తం ఉన్నానని చెబుతున్నారని, ఎంపీడీవో కార్యాలయానికి వెళితే వాళ్లు అక్కడికి రానట్టుగా తెలుస్తుందని పలువురు చెబుతున్నారు. చాలా సార్లు ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి దాపురించింది. ఇటు జిల్లా స్థాయి అధికారులు, అటు మండల స్థాయి అధికారులు వీళ్ళ మీద ఏకాగ్రత పెట్టకపోవడంతోని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తునట్లు తెలుస్తుంది.

అంతా నా ఇష్టం

భల్లు తండ గ్రామానికి చెందినటువంటి కార్యదర్శి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తునట్లు తెలుస్తుంది. నేను ఏదంటే అదే  నడుస్తది అనే రీతిలో వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి కాదు అనేకసార్లు పనుల నిమిత్తం పోతే అక్కడ అందుబాటులో లేడని అంటున్నారు. శుక్రవారం కార్యాలయానికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో ఫోన్ లో సంప్రదించగా వేరే చోట ఉన్నానని ఆఫీస్ టైమ్ కదా అంటే కార్యదర్శులకు సమయ పాలన ఉండదని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లవచ్చని చెప్పినట్లు తెలిసింది.

ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నాననే సమాధానం చెప్పినట్లు తెలిసింది. అయితే ఇదే విషయ ఉన్నతాధికారులు అడిగినా వెళ్ళాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే సమయపాలన పాటించని, అందుబాటులో ఉండని గ్రామకార్యదర్శులపై తగు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాగా ఇదే విషయమై ఎంపీడీవో ఆంజనేయులు వివరణ అడుగగా గ్రామ కార్యదర్శులను గ్రామ పంచాయతీల వద్ద లేదా మండల కేంద్రంలో నామినేషన్ సెంటర్ల వద్ద ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. భల్లు తండ గ్రామ కార్యదర్శి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సూర్యాపేటకు వెళ్లాడని చెప్పారు.