బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
బోరబండ ఎస్హెచ్‌ఓ రవి కుమార్
జూబ్లీహిల్స్,ఆగస్టు 7:బోనాల పండుగ సందర్భంగా శాంతిభద్రతలు,భక్తుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని బోరబండ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్‌ఓ రవి కుమార్ సూచించారు.ఈ మేరకు శుక్రవా రం ఆలయ కమిటీ సభ్యులు,ఉత్సవ నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఉత్సవాలను క్రమశిక్షణతో నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలహారం బండ్ల శోభాయాత్రల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,
డీజేలు మరియు అధిక శబ్ద కాలుష్యాన్ని ని యంత్రించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని,అనుమానాస్పద వ్యక్తు లు లేదా సం ఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కో రారు. ఆల య ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటి స్తూ బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.






