30-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 29: హైదరాబాద్ హైటెక్‌సిటీలో మెడికవర్ హాస్పిటల్ నూతనంగా ఈవెనింగ్ క్లినిక్‌ను గురువారం ప్రా రంభించింది. ఉద్యోగం చేస్తూ బిజీ షెడ్యూల్ ఉన్నవారు లేదా ఉదయపు సమయాల్లో ఆస్పత్రికి వెళ్లలేని వారిని దృష్టిలో ఉంచుకొ ని ఈ ప్రత్యేక సాయంత్రపు క్లినిక్‌ను ఏర్పా టు చేశారు. ఈవెనింగ్ క్లినిక్‌లో అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్, పల్మోనాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ తదితర విభాగాల్లో స్పెషలిస్టులు సేవలు అందిస్తారని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.
తదితర విభాగాల్లో వైద్యులు సేవలందించను న్నారు. ప్రతిరోజూ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5:00 గంటల నుంచి 8:00గంటల వరకు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈవెనింగ్ క్లినిక్ ప్రారంభంతో మెడికవర్ హాస్పిట ల్ ప్రజలకు మరింత చేరువగా అనువైన వైద్యసేవలను అందించనుందని తెలిపారు.
ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. అలాగే కన్సల్టేషన్లపై 50% డిస్కౌంట్, ఇన్వెస్టిగేషన్లపై 30% డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.