23 June, 2026 | 10:30 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

రోడ్డు ప్రమాదంలో మీ సేవ నిర్వాహకుని దుర్మరణం

22-03-2025 11:15 AM

ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికీ గాయాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మీ సేవ నిర్వాహకుడు మృతి చెందగా ఆటో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం శివారులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామరెడ్డి మండల కేంద్రానికి చెందిన మీ సేవ  నిర్వాహకుడు. దినేష్ బైక్ పై కామారెడ్డి నుంచి రామారెడ్డి వైపు వస్తుండగా ఎదురుగా రామారెడ్డి వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను రామారెడ్డి గ్రామ శివారులో బైక్ పై వస్తున్న దినేష్ ఆటోను ఢీ కొట్టి కింద పడడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో నడుపుతున్న లింబాద్రి తో పాటు అతని భార్య మరో ప్రయాణికురాలు కు గాయాలైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు. గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.