11 August, 2026 | 3:27 AM

లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్‌గా మీలా మహదేవ్ ఏకగ్రీవ ఎన్నిక

11-08-2026 12:08 AM

సూర్యాపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి) : సూర్యాపేట లయన్స్ కంటి హాస్పిటల్ నూతన కార్యవర్గంను సోమవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పి వి సి ఎండి మీలా మహదేవ్, కార్యదర్శిగా పెండెం చంద్రశేఖర్ కోశధికారిగా చిలుముల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఈగ దయాకర్ గుప్త, ఈసి సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా,

భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మికాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేష్ రెడ్డి, పటేల్ నర్సింహా రెడ్డి రాచకొండ శ్రీనివాస్,ధర్మారావు గౌరవ సలహా దారులు గా గుణగంటి రాములుగుడిపూడి వెంకటేశ్వర రావుమొరిశెట్టి లక్షాది లను ఎన్నుకున్నారు. కాగా మీరు హాస్పిటల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.