కాంగ్రెస్‌లో ఎవరి కుంపటి వారిది
కరీంనగర్ పార్లమెంట్‌పై నేడు మీనాక్షి జూమ్ సమీక్ష
కరీంనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కరీంనగర్ కాంగ్రెస్ లో ఎవరి కుంపటి వారిదిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నేతలతో సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.
నేతల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న ఆమె గాడిన పెడతారా చూడాలి. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం, వర్గపోర ముఖ్య నేతల మధ్య విభేదాల కారణంగా ‘ఎవరి కుంపటి వారిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జిల్లా కాంగ్రెస్లో ఐక్యత కొరవడటం, వేర్వేరు వర్గాలుగా విడిపోయి కార్యక లాపాలను సాగిస్తుండటంతో క్యాడర్ అయోమయానికి లోనవుతున్నారు.
అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు, పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో గందరగోళం నెలకొంది. పి సి సి, ఏ ఐ సి సి లు కార్యక్రాలకు పిలుపు నిచ్చిన సమయంలో, నేతల వర్ధంతులు, జయంతుల కార్యక్రమల నిర్వహణ సందర్భంలో నేతలు పాల్గొనే వరకు బాగానే ఉంటుం డగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అద్వర్యం లో జరిగినట్టు ఒక ప్రకటన, నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో జరిగినట్టు ఒక ప్రకతబ కాదు కాదు ఈ కార్యక్రమం కరీంనగర్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినట్టుగా ప్రకటనలు సర్వసాధారణం అయిపోయాయి.
ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కి సంబంధించి జరిగిన ఆందోన నుండి ఎస్ ఐ ఆర్ సమావేశాల వరకు ఏ నాయకుడికి ఆ నాయకుడు ఓన్ చేసుకొనే ప్రయత్నం చేశారు. పెద్ద నేతల పరిస్థితి ఇలా ఉంటే ఎన్ ఎస్ యూ ఐ, యివజన కాంగ్రెస్, పార్టీ అనుబంధ సంఘాల నేతలు కూడా తీసిపోని విదంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల తీరు చూసి ప్రతిపక్ష పార్టీలు నవ్వుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లాకు పెద్దదిక్కుగా ఉంటారనుకున్న మంత్రులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో జిల్లా నేతల్లో ముక్షంగా కరీంనగర్ నియోజకవర్గ నేతలు ఎవరి కుంపటి వారిదిగా వ్యవహరిస్తున్నారు.






