calender_icon.png 9 September, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరతపై ఆర్టీవో ఆధ్వర్యంలో సమావేశం

09-09-2025 12:00:00 AM

చేగుంట, సెప్టెంబర్ 8 :చేగుంట మండల రైతులు యూరియా కోసం తరచుగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తహసిల్దార్ కార్యాలయంలో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా పంపిణీ సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

చేగుంట మండలానికి పంపిణీ చేయాల్సిన యూరియాలో ఇప్పటికి మండలంలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా పంపడం జరిగిందని, కానీ ఇక్కడ సరిపోనందున అదనంగా సరఫరా చేయుటకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యూరియా పంపిణీ కార్యక్రమం జరుగుటకు తగు చర్యలు, సూచనలు ఆర్డీఓ జయచంద్ర రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ శ్రీకాంత్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, చేగుంట ఎస్ హెచ్ ఓ చైతన్య కుమార్ రెడ్డి, ఆర్.ఐ జయభారత్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.