calender_icon.png 9 September, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరికి మూడేళ్ల కఠిన కారాగారశిక్ష

09-09-2025 12:00:00 AM

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ సెప్టెంబర్ 8: (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అత్యాచారాలను విచారించే న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ ముగ్గురికి జైలుశిక్షలు విదిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.తీర్పులోని వివరాలు. కోటగిరి మండల కేంద్రంలోని చవిడి గల్లీ నివాసురాలైన గైని రామవ్వ తన ఇంటికి దగ్గర చెల్లెడిగే సుగుణకు చెందిన స్వంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేశారు.

ఖాళీ స్థలంలో షెడ్డు వేసుకోవడానికి రామవ్వ రేకులు, కట్టెలు తెచ్చిపెట్టుకున్నది.స్థలం విషయంలో అదే గల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బర్ల ప్రవీణ్ కుమార్ తన తండ్రి బర్ల భూమయ్య తమ్ముడు బర్ల నవీన్ లతో కలిసి రామవ్వ తో గొడవ పడ్డారు. 28 మార్చి, 2021న ఆమె షెడ్డు కోసం తెచ్చిపెట్టుకున్న రేకులు, కట్టెలు ధ్వంసం చేసి మురికి కాలువలో వేశారు.అడ్డుపడిన ఆమెను భూతు మాటలు తిడుతు, కులం పేరుతో దూశించి, అవమానించారు, చేతులతో కొట్టి గాయపరిచారు.

సదరు నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువైనట్లు కోర్టు తీర్పులో పేర్కొనది.ముద్దాయిలైన ప్రవీణ్ కుమార్, భూమయ్య, నవీన్ లకు ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 447(వేరొకరి ఆస్థిలోకి నేరపూరిత అతిక్రమణ )ప్రకారం మూడు నెలలు కఠిన జైలుశిక్ష ఐదు వందల రూపాయల జరిమానా, సెక్షన్ 427(ఆస్తిని నష్ట పరచడం )ప్రకారం  రెండు సంవత్సరాల జైలుశిక్ష వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 323(గాయ పరచడం )ప్రకారం ఒక సంవత్సరం జైలుశిక్ష వేయి రూపాయల జరిమానా విధించారు.

షెడ్యూల్ కులం మహిళను బహిరంగ ప్రదేశంలో అవమానించి, బెదిరించి నందుకుగాను మూడు సంవత్సరాల కఠిన కారగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా,కులంపేరుతో దూశించి అవమానించి నందుకుగాను మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు చెప్పారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలని అదనపు సెషన్స్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు.