నేడు మెదక్‌లో ఉద్యమకారుల సమావేశం
10-06-2026 01:13 AM
మెదక్, జూన్ 9 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మెదక్ లోని టీఎన్జీవో భవన్ లో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉద్యమ జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు బి. కొండల్ రెడ్డి, సడిమెల యాదగిరి తెలిపారు. మంగళవారం మెదక్ లోని గుల్షన్ క్లబ్ లో మాట్లాడారు. ఈ సమావేశంలో మెదక్ మం డలం, పట్టణం, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కొల్చారం, వెల్దుర్తి మండలాలలో పనిచేసిన ఉద్యమకారులందరూ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరారు. వారి వెంట కంది శ్రీనివాస్ రెడ్డి, శంకర్ దయాల్ చారి, బొందుగుల నాగరాజు, పీడీ ఆనందం, భూపాల్ రెడ్డి, కుమార్ మామిడి, బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య, సత్యం మనోహర్ రెడ్డి ఉన్నారు.






