డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన
రామచంద్రపురం, జూన్ 9: పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం డివిజన్ పరిధిలో బీఆర్‌ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ సూచనల మేరకు మాది సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
ఇద్దరు యువతతో పాటు సీనియర్ బూత్ కోఆర్డినేటర్ను ఎంపిక చేసి ఇంటింటికీ వెళ్లి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచం ద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్, గోవింద్ యాదవ్, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.






