calender_icon.png 4 May, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గోదావరిలో నీటి లభ్యతపై సమావేశం

12-04-2025 12:00:00 AM

కేంద్ర జల్‌శక్తి నుంచి తెలంగాణ, ఏపీలకు ఆహ్వానం

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో గోదావరి, దాని ఉపనదుల పరిధి పరివాహక ప్రాంతంలో నీటి లభ్యతపై తయారు చేసిన నివేదికపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఢిల్లీ లో ఈ నెల 21 ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర జల్‌శక్తి ఆహ్వానించింది.

కాగా.. ఈ నివేదికను హైడ్రాలజీ (దక్షిణ) డైరెక్టరేట్, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 2023, జూన్ 6న జీఆర్‌ఎంబీకి పంపింది. అనంతరం జీఆర్‌ఎంబీ ఈ నివేదికను రెండు రాష్ట్రాలకు పంపి, అభిప్రాయాలు కోరింది. 2023, ఆగస్టు 14న తెలంగాణ, 2023, ఆగస్టు 16న ఏపీ తమ అభిప్రాయాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల వ్యాఖ్యల ఆధారంగా నివేదికను సమీక్షించాల్సిందిగా జీఆర్‌ఎంబీని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కోరింది.