calender_icon.png 4 May, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

12-04-2025 12:00:00 AM

పోలీస్ అధికారులకు రాచకొండ సీపీ సూచన 

మేడ్చల్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): హనుమాన్ జయంతి ఉత్సవాలు లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, జాగ్రత్తల గురించి డిసిపిలు, ఏ సి పి లతో నేరేడ్మెట్ లోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సున్నితమైన ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని, ఊరేగింపులు శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది శోభాయాత్ర ఊరేగింపు సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిం చాలని, నంబర్ ప్లేట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు చూడాలన్నారు.

అవసరమైన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ చే తనిఖీలు నిర్వహించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ  ద్వారా పరిశీలించాలన్నారు. ఊరేగింపులో పాల్గొనే సమయంలో మహిళలు వేధింపులకు గురి కాకుండా షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. భక్తులు సంతోషంగా, శాంతియుతంగా వేడుక జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు. మతసామరస్యానికి భంగం కలిగించే వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డిసిపి ఇందిరా, స్పెషల్ బ్రాంచ్ డిసిపి నరసింహారెడ్డి, అదనపు డీసీపీ శివకుమార్, సి సి ఆర్ బి ఏ సి పి రమేష్, ఎస్బి ఏసీబీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.