12-04-2025 12:00:00 AM
మోతే, ఏప్రిల్ 11:- మోతె మండలం బుర్కచర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి ఏలీయాస్ లాస్య ఏలీయాస్ బుజ్జి పై నేరనిరూపణ కావడం తో శుక్రవారం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్. ఎం. శ్యామ్ శ్రీ నిందుతురాలిని దోషిగా నిర్ధార స్తూ ఉరి శిక్ష విధించారు. వివరలలోకి వెళ్ళితే మోతె మండలం బుర్కచర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తండాకు చెందిన బానోత్ కృష్ణ తో భారతి కి పెళ్లి జరిగింది.
కొంత కాలం మంచిగా ఉన్నారు, వారికి ఒక్క పాప ఉన్నది భారతికి మానసిక పరిస్థితి బాగోలేక పూజలు చేస్తుండేది. ఒక వ్యక్తి ఆమెకు సర్ప దొషం ఉన్నది, అనిచెప్పాగా పూజలు చేస్తుండేది, 15-04-2021న, కృష్ణ ఏపూర్ గ్రామానికి వెళ్లగా భారతి, పాప ఇద్దరే ఇంట్లిలో ఉన్నారు.
కృష్ణ భావమరిది కృష్ణ కు ఫోన్ చెసి పాప ను భారతి కత్తి తో గొంతు కోసి చంపిందని చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూడగా పాప శవం గా కనిపించడం తో కృష్ణ మోతె పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పిర్యాదు పై భారతి పై హత్య నేరం క్రింద కేసు నమోదు చేసుకొని, నిందుతురాలి పై అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. ఆంజనేయులు అభియోగ పత్రం దాఖలు చేశారు, అనంతరం విచారణ న్యాయస్థానం ఎం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్. ఎం. శ్యామ్ శ్రీ, 5,000 రూపాయల జరిమానా, ముద్దాయి చనిపోయే వరకు ఉరి తీయాలని తీర్పు లో పేర్కొన్నారు.