22 March, 2026 | 4:59 AM

వయనాడ్ వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన మెగా ఫ్యామిలీ

04-08-2024 04:07 PM

కేరళ: గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వందలాది ప్రాణాలు తీసింది.  వయనాడ్ బాధితులకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మోగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం ప్రకటించారు. కేరళలో జరిగిన విధ్వంసంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వందల మంది మృతితో తీవ్ర మనోవేదనకు గురయ్యానని, వరద బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మోగా స్టార్ పేర్కొన్నారు.