10 April, 2026 | 7:24 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

మెగా ఉచిత వైద్య శిబిరం

06-02-2026 12:00 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ఆధ్వర్యంలో పాల్వంచ మండలం వేల్పుగొండ గ్రామంలో కొనసాగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో గురువారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లైన్స్ క్లబ్ , మెడిసిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డాక్టర్ కె. విజయ్ కుమార్  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్యం సామాన్యుడికి భారమవుతున్న నేటి కాలంలో, గ్రామీణ ప్రజల వద్దకే వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.  ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజ్ గంభీరావు, వాలంటీర్లు, గ్రామంలోని వయోవృద్ధులను, మహిళలను కలిసి ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారిని శిబిరానికి తరలించారు.

ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు బి.పి, షుగర్ వంటి సాధారణ పరీక్షలతో పాటు, కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారికి, ఇతర బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, గ్రామ సర్పంచ్ శోభ సాగర్, ఉపసర్పంచ్ రవి, వార్డు మెంబర్లు రాజు, శ్రీధర్ రావు, రాములు, ఎల్లయ్య,దేవరాజ్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, మెడిసిటీ వైద్య బృందం పాల్గొన్నారు.