11-11-2025 10:54:34 PM
వెంకటాపూర్(రామప్ప) (విజయక్రాంతి): ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర భద్రతా, నిఘా విభాగాల సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వద్ద పోలీసులు హై అలర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ సిబ్బందితో పాటు పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, పార్కింగ్ స్థలం, పర్యాటకుల వాహనాలను కూడా పరిశీలించారు. భక్తులు, పర్యాటకుల రాకపోకలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.