01-07-2025 12:34:42 AM
ములుగు, జూన్ 30 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న సంకల్పంతో సామాజిక సేవకుడు బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆధ్వర్యంలో జూలై 4న భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ములుగు ఎస్బిఐ రోడ్ భూక్య జంపన్న ఆఫీస్ యందు జరిగే ఈ కార్యక్రమంలో పలు ప్రఖ్యాత కంపెనీలు పాల్గొనబోతున్నాయి.
ఈ జాబ్ మేళాలో 3,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి ఇప్పటికే పాలు ప్రైవేట్ కంపెనీలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. సామాజిక రంగంలో చురుగ్గా ఉన్న భూక్య జంపన్న ఇప్పటికే ఉచిత కంటి ఆపరేషన్ 1987 పైచిలుకు మంది పేద పజలకు చేయించడం జరిగింది మరియు పలు ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశ్వాసం సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఉపాధి అవకాశాల పరంగా కూడా ముందంజలోకి వచ్చారు. పేదవారికి విద్య ,వైద్యం ,ఉపాధి అందించడమే తన ప్రధాన లక్ష్యం అని అన్నారుపని చేసే చేతులకూ, అవకాశం కోసం ఎదురు చూస్తున్న కళ్లకూ ఒక వేదిక కావాలన్నదే ఈ జాబ్ మేళా ఉద్దేశ్యం,అని భూక్య జంపన్న వెల్లడించారు. అన్ని స్థాయిల ఉద్యోగాలకు అవకాశాలు ఈ జాబ్ మేళాలో పదో తరగతి నుంచి బీటెక్, డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ, పీజీ, విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు ఉండనున్నాయి.
నేరుగా ఇంటర్వ్యూలు వెంటనే ఆఫర్ లెటర్లు మేళాలోనే సంస్థలు ఆన్-ద-స్పాట్ ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు అదే రోజు ఆఫర్ లెటర్లు అందజేయనున్నాయి. ఈ సందర్భంగా రిజ్యూమే ప్రిపరేషన్, కెరీర్ గైడెన్స్, స్కిల్ మాడ్యూల్స్ వంటి సేవలు కూడా అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
జంపన్న పిలుపు
ఈ సందర్భంగా భూక్య జంపన్న యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధికి వెతకకూడదు, సృష్టించుకోవాలి. ఈ జాబ్ మేళా మీ భవిష్యత్కు దిశానిర్దేశం చేస్తుంది. మీ కెరీర్కి ఇది మొదటి మెట్టు కావచ్చు,అంటూ మేళాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. భూక్య జంపన్న నాయకత్వంలో జరిగే ఈ జాబ్ మేళా స్థానికంగా ఉపాధి అవకాశాల దిశగా కీలక అడుగుగా భావించబడుతోంది. జిల్లా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని కోరుతున్నారు.